Kamakhya Bhairava Upasaka Foundation
Donate

శ్రీ బటుక భైరవ బ్రహ్మకవచం

॥ శ్రీ గణేశాయ నమః ॥ ॥ శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ॥ ॥ శ్రీగురవే నమః ॥ ॥ శ్రీ భైరవాయ నమః ॥ శ్రీ దేవ్యువాచ । భగవన్సర్వవేత్తా త్వం దేవానాం ప్రీతి దాయకం । భైరవం కవచం బ్రూహి యది చాస్తి కృపా మయి ॥ 1 ॥ ప్రాణత్యాగం కరిష్యామి యది నో కథయిష్యసి । సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ న సంశయః ॥ 2 ॥ ఇత్థం దేవ్యా వచః శ్రుత్వా ప్రహస్యాతిశయం ప్రభుః । ఉవాచ వచనం తత్ర దేవదేవో మహేశ్వరః ॥ 3 ॥ ఈశ్వర ఉవాచ బాటుకం కవచం దివ్యం శృణు మత్ప్రాణవల్లభే । చండికాతంత్రసర్వస్వం బటుకస్య విశేషతః ॥ 4 ॥ తత్ర మంత్రాద్యక్షరం తు వాసుదేవస్వరూపకం । శంఖవర్ణద్వయో బ్రహ్మా బటుకశ్చంద్రశేఖరః ॥ 5 ॥ ఆపదుద్ధారణో దేవో భైరవః పరికీర్తితః । ప్రవక్ష్యామి సమాసేన చతుర్వర్గప్రసిద్ధయే ॥ 6 ॥ ప్రణవః కామదం విద్యా లజ్జాబీజం చ సిద్ధిదం । బటుకాయేతి విజ్ఞేయం మహాపాతకనాశనం ॥ 7 ॥ ఆపదుద్ధారణాయేతి త్వాపదుద్ధారణం నృణాం । కురుద్వయం మహేశాని మోహనే పరికీర్తితం ॥ 8 ॥ బటుకాయ మహేశాని స్తంభనే పరికీర్తితం । లజ్జాబీజం తథా విద్యాన్ముక్తిదం పరికీర్తితం ॥ 9 ॥ ద్వావింశత్యక్షరో మంత్రః క్రమేణ జగదీశ్వరి । ॥ ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ॥ (ఈ మంత్రాన్ని కవచం పఠించే ముందు, మరియు తరువాత, 11 మార్లు లేదా 21 మార్లు జపించాలి) ఓం అస్య శ్రీ బటుక భైరవ బ్రహ్మ కవచస్య భైరవ ఋషిః । అనుష్టుప్ ఛందః । శ్రీ బటుక భైరవో దేవతా । మమ శ్రీ బటుక భైరవ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ॥ అథ పాఠః । ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే ॥ 10 ॥ బటుకాయ పాతు నాభౌ చ ఆపదుద్ధారణాయ చ ॥ కురుద్వయం లింగమూలే త్వాధారే వటుకాయ చ ॥ 11 ॥ సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగలమేవ చ ॥ షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః ॥ 12 ॥ ఓం హ్రీం బటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా ॥ ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరాసనో హృది ॥ 13 ॥ ఓం హ్రీం కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః ॥ గణరాట్ పాతు జిహ్వాయామష్టాభిః శక్తిభిః సహ ॥ 14 ॥ ఓం హ్రీం దండపాణిర్గుహ్యమూలే భైరవీసహితస్తథా ॥ ఓం హ్రీం విశ్వనాథః సదా పాతు సర్వాంగం మమ సర్వదః ॥ 15 ॥ ఓం హ్రీం అన్నపూర్ణా సదా పాతు చాంసౌ రక్షతు చండికా ॥ ఆసితాంగః శిరః పాతు లలాటం రురుభైరవః ॥ 16 ॥ చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీక్రోధభైరవః ॥ ఉన్మత్తభైరవః పాతు హృదయం మమ సర్వదా ॥ 17 ॥ నాభిదేశే కపాలీ చ లింగే భీషణభైరవః ॥ సంహారభైరవః పాతు మూలాధారం చ సర్వదా ॥ 18 ॥ బాహుయుగ్మం సదా పాతు భైరవో మమ కేవలం ॥ హంసబీజం పాతు హృది సోఽహం రక్షతు పాదయోః ॥ 19 ॥ ప్రాణాపానౌ సమానం చ ఉదానం వ్యానమేవ చ ॥ రక్షతు ద్వారమూలే చ దశదిక్షు సమంతతః ॥ 20 ॥ ప్రణవం పాతు సర్వాంగం లజ్జాబీజం మహాభయే ॥ ఇతి శ్రీబ్రహ్మకవచం భైరవస్య ప్రకీర్తితం ॥ 21 ॥ చతువర్గప్రదం నిత్యం స్వయం దేవప్రకాశితం ॥ యః పఠేచ్ఛృణుయాన్నిత్యం ధారయేత్కవచోత్తమం ॥ 22 ॥ సదానందమయో భూత్వా లభతే పరమం పదం ॥ యః ఇదం కవచం దేవి చింతయేన్మన్ముఖోదితం ॥ 23 ॥ కోటిజన్మార్జితం పాపం తస్య నశ్యతి తత్క్షణాత్ ॥ జలమధ్యేఽగ్నిమధ్యే వా దుర్గ్రహే శత్రుసంకటే ॥ 24 ॥ కవచస్మరణాద్దేవి సర్వత్ర విజయీ భవేత్ ॥ భక్తియుక్తేన మనసా కవచం పూజయేద్యది ॥ 25 ॥ కామతుల్యస్తు నారీణాం రిపూణాం చ యమోపమః ॥ తస్య పాదాంబుజద్వందం రాజ్ఞాం ముకుటభూషణం ॥ 26 ॥ తస్య భూతిం విలోక్యైవ కుబేరోఽపి తిరస్కృతః ॥ యస్య విజ్ఞానమాత్రేణ మంత్రసిద్ధిర్న సంశయః ॥ 27 ॥ ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్బటుకం నరః ॥ న చాప్నోతి ఫలం తస్య పరం నరకమాప్నుయాత్ ॥ 28 ॥ మన్వంతరత్రయం స్థిత్వా తిర్యగ్యోనిషు జాయతే ॥ ఇహ లోకే మహారోగీ దారిద్ర్యేణాతిపీడితః ॥ 29 ॥ శత్రూణాం వశగో భూత్వా కరపాత్రీ భవేజ్జడః ॥ దేయం పుత్రాయ శిష్యాయ శాంతాయ ప్రియవాదినే ॥ 30 ॥ కార్పణ్యరహితాయాలం బటుకభక్తిరతాయ చ ॥ యోఽపరాగే ప్రదాతా వై తస్య స్యాదతిసత్వరం ॥ 31 ॥ ఆయుర్విద్యా యశో ధర్మం బలం చైవ న సంశయః ॥ ఇతి తే కథితం దేవి గోపనీయం స్వయోనివత్ ॥ 32 ॥ ॥ ఇతి శ్రీ రుద్రయామలోక్తం శ్రీ బటుక భైరవ బ్రహ్మ కవచం సంపూర్ణం ॥